Andhra Pradesh: మహానుభావులు పుట్టిన జిల్లాలో గంజాయి మొక్కలా జగన్ పుట్టాడు: బద్వేలులో చంద్రబాబు

  • ‘రతనాల సీమ’ హామీని నిలబెట్టుకున్నా
  • బద్వేల్ లో గోదావరి నీళ్లతో వ్యవసాయం చేయనున్నారు
  • 31 కేసులు పెట్టుకున్న మహానాయకుడు జగన్

కడప జిల్లాలో మహానుభావులు పుట్టారని, తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు జగన్ కూడా ఇక్కడే పుట్టాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా బద్వేలులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ రాళ్ల సీమగా మారే పరిస్థితుల్లో దాన్ని ‘రతనాల సీమ’ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని అన్నారు.

భవిష్యత్ లో సోమసిల, గోదావరి నీళ్లొస్తాయని, బద్వేల్ లో గోదావరి నీళ్లతో రైతులు వ్యవసాయం చేయబోతున్నారని చెప్పారు. రాయలసీమ వ్యాప్తంగా కృష్ణానది నీరు ప్రజలు తాగుతున్నారని, ఈ నీళ్లు తాగేవాళ్లందరూ ఆలోచించాల్సిన విషయం తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలని సూచించారు. వేరే పార్టీల వాళ్లకు ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు.

అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రమే ముందుంది అని, మన దురదృష్టం కొద్దీ మోదీ మనల్ని నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. రాజకీయం మాట్లాడేందుకు తాను ఇక్కడకు రాలేదని, భవిష్యత్ గురించి చెప్పేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. 31 కేసులు పెట్టుకున్న మహానాయకుడు జగన్ అని తనకు ఓటెయ్యలంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాడని సెటైర్లు వేశారు.

More Telugu News