Telangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ.. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం!

  • కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో మద్దతు
  • మూడు స్థానాలపై తొలుత దృష్టి పెట్టిన టీడీపీ
  • చంద్రబాబు ఆదేశాలతో నేతలు వెనక్కు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలు మరోసారి చేతులు కలిపాయి. ఇందులో భాగంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ చరిత్రలో తొలిసారి పోటీ నుంచి తప్పుకున్నట్లు అయింది. తెలంగాణలో పార్టీ కేడర్ ను కాపాడుకునేందుకు పోటీచేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంతియా టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని టీటీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై పార్టీ ముఖ్యులతో చర్చించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.

కాగా, తొలుత మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నుంచి పోటీ చేయాలని టీడీపీ భావించింది. అయితే అధిష్ఠానం నిర్ణయం నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు అసంతృప్తికి గురయ్యారు.

More Telugu News