kondapalli Kondala Rao: విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రాజీనామా.. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటన

  • 37 ఏళ్లుగా సేవలందిస్తున్నా గుర్తింపు లేదు
  • కేఏ నాయుడికి వద్దని చెప్పినా సీటు ఇచ్చారు
  • మంచి అవకాశం ఇస్తానని మోసం చేశారు
టీడీపీకి మరో వికెట్ పడింది. 37 ఏళ్లుగా టీడీపీలో కొనసాగిన విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని, రేపు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

తన తండ్రి, మాజీ ఎంపీ పైడితల్లి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీకి అండగా నిలిచామన్నారు. 37 ఏళ్లపాటు టీడీపీకి సేవలందిస్తున్నా గుర్తింపు లేదన్నారు. నియోజకవర్గ నేతలంతా కలిసి కేఏ నాయుడికి సీటు ఇవ్వొద్దన్నా సీటు ఇచ్చారన్నారు. 2014లో తన తమ్ముడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకు మంచి అవకాశం కల్పిస్తామని మోసం చేశారని కొండపల్లి వాపోయారు. అందుకే టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు.
kondapalli Kondala Rao
Paiditalli Naidu
Telugudesam
YSRCP
KA Naidu

More Telugu News