gurajala: గురజాల ఎమ్మెల్యే అనుచరుడి హత్యకు కుట్ర భగ్నం.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

  • నాటు తుపాకులు, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం
  • భూతగాదాలు, పాత కక్షలే కారణం
  • నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు

గుంటూరు జిల్లా గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరుడు వెంకటేశ్వర్లును హత్య చేసేందుకు ముగ్గురు వ్యక్తులు వ్యూహం పన్నారు. ఈ నేపథ్యంలో వారు మారణాయుధాలతో సంచరిస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేశారు.

కాసేపటి క్రితం నిందితులు పూర్ణచంద్రరావు, శ్రీనివాసరావు, శివకృష్ణ అనే నిందితులను గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు సమక్షంలో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నిందితుల వద్ద నుంచి నాటు తుపాకులతో పాటు ఐదు సెల్ ఫోన్లు, స్కోడా కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. భూతగాదాలు, పాత కక్షలే ఘటనకు ప్రధాన కారణంగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. కేసును లోతుగా విచారించే నిమిత్తం నిందితులను పోలీసు కస్టడీకి కోరనున్నామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో, పల్నాడు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.

More Telugu News