Guntur District: నరసరావుపేటలో లక్ష ఓట్ల మెజార్టీతో నా గెలుపు ఖాయం: టీడీపీ ఎంపీ రాయపాటి ధీమా

  • ఎటువంటి ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు
  • తన అనుచరులతో కలిసి ఆటోలో వెళ్లిన రాయపాటి
  • కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయం
గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న టీడీపీ సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈరోజు నామినేషన్ వేశారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆటో రిక్షాలో, తన అనుచరులతో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్లారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, లక్ష ఓట్ల మెజార్టీతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని అన్ని ఎంపీ స్థానాల్లోనూ టీడీపీనే విజయం సాధిస్తుందని, కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయమని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి తనను మళ్లీ గెలిపిస్తే, పల్నాడుకు సాగు, తాగు నీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, పారిశ్రామికంగా పల్నాడు ప్రాంతం అభివృద్ధికి పాటు పడతానని చెప్పారు.
Guntur District
Narasarao pet
Telugudesam
rayapati

More Telugu News