బీజేపీ అగ్రనేతలకు యెడ్యూరప్ప రూ. 1800 కోట్ల ముడుపులు ఇచ్చారు: కాంగ్రెస్ ఆరోపణ
- యెడ్డీ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ అగ్రనేతలకు ముడుపులు
- యెడ్డీ డైరీస్ లో జైట్లీ, రాజ్ నాథ్ తదితరుల పేర్లు
- దీనిపై మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదు?
ఈ డైరీలో అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ వంటి ఎందరో అగ్రనేతల పేర్లు ఉన్నాయని సూర్జేవాలా అన్నారు. బీజేపీ నేతలు రూ. 1800 కోట్లు లంచంగా తీసుకున్నారని విమర్శించారు. దీనిపై యెడ్యూరప్ప సంతకం కూడా ఉందని చెప్పారు. 2017 నుంచి ఈ డైరీ ఆదాయపు పన్ను విభాగం వద్ద ఉందని తెలిపారు. దీనిపై మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.
బీజేపీపై ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు వెంటనే విచారణ జరిపించాలని అన్నారు. లోక్ పాల్ కూడా ఇప్పుడు నియమితులయ్యారని... ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేయించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి 'ద కారవాన్' అనే పత్రికలో ఒక కథనం వచ్చింది. బీజేపీ అగ్రనేతలకు యెడ్డీ సీఎంగా ఉన్నప్పుడు రూ. 1800 కోట్లు అందాయని కథనంలో పేర్కొంది.