ntr: 1920 నాటి కార్లను భారీ రేటుకు అద్దెకు తెప్పించిన రాజమౌళి

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • 1920 నేపథ్యంలో సాగే కథ
  • ఏడాది పాటు అద్దెకి పాత కార్లు  

ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు జరిగిపోతోంది. ఇప్పటికే ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. 1920 కాలం నాటి నేపథ్యంలో సాగే కథ ఇది. అందువలన ఆ కాలం నాటి కార్లను కూడా ఈ సినిమాలో చూపించవలసి ఉంటుంది.

బెంగళూర్ కి చెందిన రవిప్రకాశ్ అనే వ్యాపారి .. ఆ కాలానికి చెందిన ప్రత్యేకమైన కార్లను సేకరించి .. వాటిని అద్దెకు ఇస్తూ ఉంటాడట. చారిత్రక నేపథ్యంతో సినిమాలు తీసేవాళ్లు ఒకటి రెండు వారాలకి వాటిని అద్దెకి తీసుకువెళుతూ ఉంటారట. అయితే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగు మొదలుకావడానికి ముందే రాజమౌళి ఆయనని కలిసి, 1920 నాటి కార్లను ఒక ఏడాదికి అద్దె మాట్లాడుకుని వాటిని తెప్పించారట. ఇందుకుగాను రవిప్రకాశ్ కి భారీమొత్తమే ముట్టిందని చెప్పుకుంటున్నారు.

More Telugu News