సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో బాలకృష్ణ దంపతుల పూజలు... కొత్త పార్టీల ప్రభావం ఉండదంటూ పెదవి విరుపు
Add ap7am to your home Screen

సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో బాలకృష్ణ దంపతుల పూజలు... కొత్త పార్టీల ప్రభావం ఉండదంటూ పెదవి విరుపు

  • హత్యారాజకీయాలు వైసీపీకి అలవాటే
  • అభివృద్దే నన్ను గెలిపిస్తుంది
  • నేడు బాలయ్య నామినేషన్
సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు టీడీపీ అధినాయకత్వం మరోసారి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన అర్ధాంగి వసుంధరతో కలిసి హిందూపురం సూగూరు ఆంజనేయస్వామి ఆలయానికి విచ్చేసిన బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుందని అన్నారు. కొత్తగా వచ్చే పార్టీలు రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చంటూ పరోక్షంగా జనసేనపై వ్యాఖ్యలు చేశారు. వైసీపీపైనా తన అభిప్రాయాలు తెలుపుతూ, హత్యారాజకీయాలు చేయడం ఆ పార్టీకి అలవాటేనని పేర్కొన్నారు. టీడీపీకి కాకుండా ఇతర ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీకే లాభమని బాలకృష్ణ అన్నారు.
Balakrishna
Telugudesam

More Telugu News