నేను పోటీ చేయనంతే.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన టీడీపీ పూతలపట్టు అభ్యర్థి తెర్లాం పూర్ణం!
- చిత్తూరు జిల్లా టీడీపీలో విచిత్రాలు
- మొదటి నుంచి రేసులో లలిత కుమారి
- ఆమెను కాదని పూర్ణంకు టికెట్ ఇచ్చిన బాబు
పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే ఇక్కడ టికెట్ వస్తుందని అందరూ భావించారు. అందుకు అనుగుణంగానే ఆమె ప్రచారంలోకి కూడా దిగిపోయారు. అయితే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనూహ్యంగా తెర్లాం పూర్ణంకు సోమవారం రాత్రి టికెట్ కేటాయించారు. దీంతో ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన పూర్ణం తాను పోటీచేయబోనని తేల్చిచెప్పారు.
అయినా ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక పూతలపట్టు టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇక పూతలపట్టు నుంచి వైసీపీ తరఫున ఎంఎస్ బాబు పోటీచేస్తున్నారు.