Andhra Pradesh: నేను పోటీ చేయనంతే.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన టీడీపీ పూతలపట్టు అభ్యర్థి తెర్లాం పూర్ణం!

  • చిత్తూరు జిల్లా టీడీపీలో విచిత్రాలు
  • మొదటి నుంచి రేసులో లలిత కుమారి
  • ఆమెను కాదని పూర్ణంకు టికెట్ ఇచ్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. తమకు టికెట్లు దక్కనందున నేతలు మరో పార్టీలోకి జంప్ అవుతుంటే, టికెట్ దక్కించుకున్న నేతలు మాత్రం పోటీ చేయబోమని చెబుతున్నారు. టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ టికెట్ దక్కించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి.. మరుసటి రోజే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి తెర్లాం పూర్ణం తాను పోటీ చేయబోనని చెబుతున్నారు.

పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే ఇక్కడ టికెట్ వస్తుందని అందరూ భావించారు. అందుకు అనుగుణంగానే ఆమె ప్రచారంలోకి కూడా దిగిపోయారు. అయితే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనూహ్యంగా తెర్లాం పూర్ణంకు సోమవారం రాత్రి టికెట్ కేటాయించారు. దీంతో ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన పూర్ణం తాను పోటీచేయబోనని తేల్చిచెప్పారు.

అయినా ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక పూతలపట్టు టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇక పూతలపట్టు నుంచి వైసీపీ తరఫున ఎంఎస్ బాబు పోటీచేస్తున్నారు.

More Telugu News