Nara Devansh: కొడుకుతో తిరుమలకు వచ్చిన నారా బ్రాహ్మణి... రూ. 30 లక్షల విరాళం!

  • నేడు దేవాన్ష్ పుట్టినరోజు
  • స్వామి దర్శనం చేయించిన అధికారులు
  • అన్నదాన సత్రానికి విరాళం
నేడు చంద్రబాబు మనవడు, లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో నారా వారి ఫ్యామిలీ సందడి చేసింది. దేవాన్ష్ ను తీసుకుని భువనేశ్వరి, బ్రాహ్మణిలు తిరుమలకు రాగా, అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం ప్రారంభమయ్యే ముందు వారికి దర్శనం చేయించి, రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి, ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద ట్రస్ట్ కు రూ. 30 లక్షలను బ్రాహ్మణి అందించారు. ఆపై దేవాన్ష్ తో కలిసి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చిన వారు, భక్తులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించి, వారితో పాటు కలిసి తాము కూడా సవీకరించారు. పలువురు టీటీడీ అధికారులు భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటే ఉండి, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
Nara Devansh
Tirumala
Birthday
Bhuvaneshwari
Brahmani

More Telugu News