Andhra Pradesh: ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే సిగ్గు, లజ్జ అక్కర్లేదు.. కామన్ సెన్స్ చాలు!: సీఎం చంద్రబాబు

  • ఎవరిని అడిగినా వైసీపీ బీజేపీకి బీ-టీమ్ అని చెబుతారు
  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వైసీపీ కేసీఆర్ కాళ్లదగ్గర పెట్టింది
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఏపీ ముఖ్యమంత్రి
ప్రతిపక్ష వైసీపీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. కామన్ సెన్స్ ఉన్నవారిని ఎవరిని అడిగినా వైసీపీ బీజేపీకి బీ-టీమ్ అని చెబుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళ్ల దగ్గర ఆంధ్రా ఆత్మగౌరవం తాకట్టుపెడుతున్న టీ-టీమ్ ఎవరంటే వైసీపీ అనే చెబుతారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలకు ఏమాత్రం పౌరుషం, రోషం ఉన్నా, వాళ్లు బీజేపీకి బీ-టీమ్, కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కాదని ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కావాల్సింది సిగ్గు, లజ్జ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకు కామన్స్ సెన్స్ చాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అండగా నిలిచింది చంద్రబాబు అనీ, అభివృద్ధిని పరుగులెత్తిస్తోంది చంద్రబాబేనని పసికందుకు కూడా తెలుసన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో చూసి ఓటేయాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
KCR
Jagan
TRS
BJP

More Telugu News