south central railway: సికింద్రాబాద్‌ - కాకినాడ మధ్య ప్రత్యేక రైలు

  • దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రకటన
  • మార్చి 22, ఏప్రిల్‌ 5వ తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి
  • మార్చి 24, ఏప్రిల్‌ 7వ తేదీల్లో కాకినాడ టౌన్‌ నుంచి
సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ పట్టణానికి ప్రత్యేక రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్‌ - కాకినాడ - సికింద్రాబాద్‌ మధ్య మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నడపాలని నిర్ణయించారు. 07457 నంబరు రైలు సికింద్రాబాద్‌ నుంచి మార్చి 22, ఏప్రిల్‌ 5వ తేదీల్లో రాత్రి 7.30 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. ఇదే రైలు (నం. 07458) తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్‌ నుంచి మార్చి 24, ఏప్రిల్‌ 7వ తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.
south central railway
spl train
KKD-secundrabad

More Telugu News