బీజేపీ అసమ్మతి నేత శతృఘ్న సిన్హాకు కాంగ్రెస్ టికెట్?
- పాట్నా సాహిబ్ నుంచి బరిలోకి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్?
- శతృఘ్న సిన్హాను అదే స్థానం నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ వ్యూహం
- త్వరలోనే కాంగ్రెస్ తీర్థం?
సిట్టింగ్ స్థానమైన పాట్నా సాహిబ్ నుంచే తాను తిరిగి బరిలోకి దిగనున్నట్టు శతృఘ్న సిన్హా ఇప్పటికే ప్రకటించారు. అయితే, బీజేపీ మాత్రం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆ స్థానంలో పోటీకి దించాలని భావిస్తోంది. గత కొంతకాలంగా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సిన్హా ఇటీవల బెంగాల్లో ప్రతిపక్షాలు నిర్వహించిన ఐక్యతా ర్యాలీలోనూ పాల్గొన్నారు.