Chandrababu: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఫిర్యాదు

  • చంద్రబాబును కించపరిచేలా సీన్లు ఉన్నాయి
  • టీడీపీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుంది
  • ఫిర్యాదు చేసిన విజయవాడ వాసి

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మొదటి నుంచి ఏదో ఒకరూపంలో కలకలం రేపుతోంది. ఈ సినిమాపై చాలాకాలంగా టీడీపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. తాజాగా, విజయవాడకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దుచేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని సెన్సార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా సీన్లు ఉన్నాయని, చంద్రబాబును అవమానించేలా చిత్రీకరించారని శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News