Chandrababu: ​ అసలు గుజరాత్ లో నాలెడ్జ్ ఎక్కడుంది?: చంద్రబాబు విమర్శలు

  • జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఏపీ సీఎం
  • మోదీపై విమర్శనాస్త్రాలు
  • మోదీని ఎదిరించినందుకే మాకీ కష్టాలు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గుజరాత్ అభివృద్ధి మోడల్ అంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి మోదీ పేర్కొన్న గుజరాత్ మోడల్ లో గొప్పదనం ఏమీలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలెడ్జ్ ఎకానమీ అనేది పూర్తిగా 21వ శతాబ్దానికి సంబంధించినదని, అసలు గుజరాత్ లో నాలెడ్జ్ ఎక్కడుందని అన్నారు. గుజరాత్ లో వ్యాపార రంగాన్ని చూసి అదో అద్భుతమైన మోడల్ అంటూ ప్రచారం చేసుకున్నారు తప్ప, దానికంటే తాను ఏర్పాటు చేసిన హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ ఎంతో మెరుగైనదని పేర్కొన్నారు.  

ప్రధాని మోదీకే నాయకత్వ లక్షణాలు లేవని, ఒకవేళ నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్లెవరైనా తారసపడితే వాళ్లను తొక్కేయడానికే ప్రయత్నిస్తారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలోని అనేకమంది మోదీని విమర్శిస్తే ఏమవుతుందోనన్న భయంతో వెనకడుగు వేస్తున్న తరుణంలో తాను, రాహుల్ గాంధీ ప్రధాని మోదీని విమర్శించామని, అందుకే తమపై ఐటీ దాడులు, ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయని అన్నారు. మోదీ దేశ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా మండిపడ్డారు.

More Telugu News