chaitu: యూఎస్ లో 150 లొకేషన్లలో 'మజిలీ' రిలీజ్

  • 'మజిలీ'పై భారీ అంచనాలు
  • ఈ సినిమాపై చైతూ ఆశలు
  •  ఏప్రిల్ 5వ తేదీన విడుదల

శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ .. సమంత జంటగా 'మజిలీ' సినిమా నిర్మితమైంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. యూఎస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

యూఎస్ లో దాదాపు 150 లొకేషన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చైతూ క్రికెటర్ గా .. ఆయన భార్యగా సమంత .. ప్రియురాలిగా దివ్యాంకా కౌశిక్ నటించారు. ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా తప్పకుండా గట్టి హిట్ కొడుతుందనే టాక్ వినిపిస్తోంది. వరుస పరాజయాలతో వున్న చైతూకి ఈ సినిమా సక్సెస్ ను .. ఉత్సాహాన్ని ఇస్తుందేమో చూడాలి.

More Telugu News