mahabubnagar: అంతర్గత విభేదాలే కాంగ్రెస్‌కు శాపం: డి.కె.అరుణ

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే కారణం
  • సీఎం కేసీఆర్‌ను ఓడించాలంటే బలమైన ప్రత్యామ్నాయం ఉండాలి
  • అది బీజేపీతోనే సాధ్యం

కాంగ్రెస్‌ పార్టీ విజయానికి అంతర్గత విభేదాలే శాపమని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి అదే కారణమని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న డి.కె.అరుణ విమర్శించారు. పార్టీ నాయకుల మధ్య అనైక్యత పార్టీ పురోగతికి పెద్ద దెబ్బన్నారు. కుమ్ములాటలు, కొట్లాటల వల్లే పార్టీ విజయానికి దూరమవుతూ వస్తోందని చెప్పుకొచ్చారు.

 మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ నిన్న రాత్రి బీజేపీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే మరో బలమైన జాతీయ పార్టీ కావాలని, అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ అవకాశాన్ని కాంగ్రెస్‌ వినియోగించుకోలేక పోయిందన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్‌ పూర్తిగా బహీనపడిపోయిందని అరుణ అభిప్రాయపడ్డారు. ఇక అధికారం, మరో ప్రయోజనం కోసం లాలూచీ పడ్డవారే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. బీజేపీలో చేరిన డి.కె.అరుణ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది.

More Telugu News