Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తున్న ఇతర పార్టీల నేతలు వీరే

  • గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న పవన్
  • గాజువాకలో పల్లా, నాగిరెడ్డిలతో పోటీ
  • భీమవరంలో పోటీ పడుతున్న పులవర్తి, గ్రంధి శ్రీనివాస్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్టణం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు జనసేన నుంచి అధికార ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో జనసేనానిపై పోటీ చేయబోతున్న ఇతర పార్టీల నేతలు ఎవరో ఓ సారి చూద్దాం.

గాజువాక నియోజకవర్గం:
టీడీపీ - పల్లా శ్రీనివాసరావు
వైసీపీ - టి.నాగిరెడ్డి
బీజేపీ - పులుసు జనార్దన్

భీమవరం నియోజకవర్గం:
టీడీపీ - పులవర్తి రామాంజనేయులు
వైసీపీ - గ్రంధి శ్రీనివాస్
బీజేపీ - ప్రకటించాల్సి ఉంది.

More Telugu News