'పీఎమ్ నరేంద్ర మోదీ' కొత్త రిలీజ్ డేట్
- ప్రధాన పాత్రధారిగా వివేక్ ఒబెరాయ్
- దర్శకుడిగా ఒమంగ్ కుమార్
- ఏప్రిల్ 5వ తేదీన విడుదల
ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఒక వారం ముందుగానే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అలా ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. నరేంద్ర మోదీ జీవితంలోని ఒడిదుడుకులు .. వాటిని అధిగమిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. ఆదర్శవంతమైన ఆయన జీవితచరిత్రకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.