Posani Krishna Murali: 'ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు' సినిమాలో నేను ఎవరినీ తిట్టలేదు: పోసాని వివరణ

  • తన సినిమాను ఈసీ నిలిపివేయడం దారుణం
  • మూడు పేజీల వివరణను పంపించాను
  • సినిమాలో ఏముందో కూడా చూడకుండా దారుణంగా వ్యవహరించారు
సెన్సార్ నిబంధనలకు లోబడే తాను 'ముఖ్యమంత్రి గారు... మీరు మాట ఇచ్చారు' అనే సినిమాను తెరకెక్కించానని విలక్షణ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ చిత్రంలో ఎవరినీ తిట్టలేదని చెప్పారు. ఎవరో మోహన్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు తన సినిమాను ఈసీ నిలిపేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ మార్కండేయులు తనకు లేఖ పంపారని... దీనికి సమాధానంగా మూడు పేజీలతో కూడిన వివరణను ఆయనకు పంపించానని చెప్పారు. సినిమాలో ఏముందో కూడా తెలుసుకోకుండా తన సినిమాను ఆపివేయడం దారుణమని అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Posani Krishna Murali
mukhyamanthi ragu meeru maata icharu
tollywood
ec

More Telugu News