Chandrababu: ఆయారాం.. గయారాంలతో ఒరిగేది ఏమీ లేదు: చంద్రబాబు

  • టీడీపీకి కార్యకర్తలే అసలైన బలం
  • వివేకా హత్యను జగన్ ఎందుకు దాచిపెట్టారు
  • వివేకా హత్య ఇంటి దొంగల పనేనని ప్రజలు అనుకుంటున్నారు
ఆయారాం... గయారాంలతో టీడీపీకి ఒరిగేది ఏమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే అసలైన బలమని తెలిపారు. తాను ఎప్పుడూ కార్యకర్తల మనిషినేనని, కార్యకర్తల త్యాగాలను గౌరవించే వ్యక్తినని చెప్పారు. పట్టిసీమను నిర్మించడం ద్వారా శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందించామని అన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి  శ్రీకారం చుట్టామని చెప్పారు. సోమశిల-కండలేరు ప్రాజెక్టులను టీడీపీనే పూర్తి చేసిందని అన్నారు. నెల్లూరు ఎన్నికల సన్నాహక సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వైయస్ వివేకా హత్యను ఎందుకు దాచిపెట్టారని వైసీపీ అధినేత జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించే యత్నం చేశారని మండిపడ్డారు. సొంత బాబాయ్ చనిపోయినా, జగన్ లో బాధ లేదని అన్నారు. వివేకా హత్య ఇంటి దొంగలు చేసిన పనే అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. కేసులకు భయపడి మోదీ, కేసీఆర్ ల ముందు జగన్ మోకరిల్లారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ కేసులు వేస్తే... రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారని మండిపడ్డారు. 
Chandrababu
jagan
kcr
modi
ysrcp
Telugudesam
TRS
bjp

More Telugu News