Adala: తెలుగుదేశం టికెట్ ఇచ్చినా... వద్దంటూ వైసీపీలోకి ఆదాల ప్రభాకర్ రెడ్డి!

  • నెల్లూరు రూరల్ నుంచి టికెట్ పొందిన ఆదాల
  • టీడీపీ టికెట్ వద్దని స్పష్టం
  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తొలి జాబితాలో భాగంగా ప్రకటించిన 126 మందిలో నెల్లూరు రూరల్ నుంచి టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, అనూహ్యంగా పార్టీ మారారు. తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే టికెట్ తనకు వద్దని చెబుతూ, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఫ్యాన్ కిందకు చేరిపోయారు.

పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఎంపికైన నేత ఇలా, టిక్కెట్‌ వద్దని తిరస్కరించడం టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చకు తెరలేపింది. కాగా, తెలుగుదేశం నుంచి సిట్టింగ్‌ ఎంపీలు అవంతి శ్రీనివాస్‌ (అనకాపల్లి), పీ రవీంద్రబాబు (అమలాపురం), సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట), ఆమంచి కృష్ణమోహన్‌ (చీరాల) తదితరులు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Adala
Telugudesam
YSRCP
Nellore District

More Telugu News