Mahesh Babu: కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి అభిమానిని కలిసి ధైర్యం చెప్పిన మహేశ్

  • పర్వీన్ బేబికి మహేశ్ అంటే చాలా ఇష్టం
  • పర్వీన్‌తో చాలా సేపు గడిపిన మహేశ్ 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

కేన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని కలిసి ధైర్యం చెప్పి సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిమానుల మనసులు దోచుకున్నాడు. శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి(12) కేన్సర్‌తో బాధపడుతోంది. ఈ చిన్నారికి మహేశ్ అంటే చాలా ఇష్టమట. విషయం తెలుసుకున్న మహేశ్, శ్రీకాకుళం వెళ్లి పర్వీన్‌ని కలిసి చాలా సేపు అక్కడే గడిపాడు. పర్వీన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఆ చిన్నారికి ధైర్యం చెప్పి భారంగా అక్కడి నుంచి కదిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

More Telugu News