nani: 'జెర్సీ'కి 'కాంచన 3' నుంచి గట్టి పోటీ!

  • నాని కథానాయకుడిగా 'జెర్సీ'
  • ఏప్రిల్ 19వ తేదీన విడుదల 
  • అదే రోజున రానున్న 'కాంచన 3'

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా నిర్మితమైంది. నాని క్రికెటర్ గా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక లారెన్స్ 'కాంచన 3' కూడా అదే రోజున థియేటర్స్ కి రానుంది.

'కాంచన 3' అనువాద చిత్రమే అయినా, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎంతో ఆసక్తి వుంది. లారెన్స్ కథానాయకుడిగా .. దర్శకుడిగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమాలన్నీ కూడా భారీ వసూళ్లను సాధించాయి .. అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఈ సినిమా తప్పకుండా 'జెర్సీ'కి గట్టిపోటీ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లారెన్స్ సరసన ఓవియా .. వేదిక నాయికలుగా నటించిన ఈ సినిమా, నిజంగానే అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి

More Telugu News