ఫినిష్ చేస్తానన్నారు.. కానీ, మనుషులనే లేకుండా చేస్తారని అనుకోలేదు: ధర్మాన
- పోలీసులు చేయాల్సిన విచారణను కూడా చంద్రబాబే చేస్తున్నారు
- పోలీసులు ఏం చేయాలో కూడా ఆయనే చెబుతున్నారు
- ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు
వివేకా హత్య కేసులో పరువు పోకముందే సీబీఐ చేత చంద్రబాబు విచారణ చేయించాలని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబుకు సీబీఐ కావాలని... అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రంలో సీబీఐని అడుగుపెట్టనీయరని అన్నారు. ఫినిష్ చేస్తానని చంద్రబాబు అన్నారని... అయితే, మనుషులనే లేకుండా చేస్తారని మాత్రం అనుకోలేదని చెప్పారు.