samanta: వరుస సినిమాలతో పలకరించనున్న సమంత

  • ఈ నెల 29వ తేదీన 'సూపర్ డీలక్స్'
  • వచ్చేనెల 5వ తేదీన 'మజిలీ'
  • లైన్లోకి వచ్చేసిన 'ఓ బేబీ'

సమంత కథానాయికగా నటించిన తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్' .. ఈ నెల 29వ తేదీన అక్కడ విడుదల చేస్తున్నారు. ఇదే రోజున తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. ఇక సమంత - చైతూ కాంబినేషన్లో రూపొందిన 'మజిలీ' సినిమాను తెలుగులో ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఇక సమంత ప్రధాన పాత్రధారిగా చేసిన 'ఓ బేబీ' కూడా ఈ వేసవిలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను మాత్రం తమిళంలో కాకుండా తెలుగులో మాత్రమే విడుదల చేయనున్నారు. ఈ మూడు సినిమాలు కూడా కథాకథనాల పరంగా విభిన్నమైనవి. క్రితం ఏడాది వేసవిలో వచ్చిన సమంత సినిమాలు మూడూ భారీ విజయాలను అందుకున్నాయి. ఈ ఏడాది వేసవిలో రానున్న మూడు సినిమాలు కూడా అదే రికార్డును రిపీట్ చేస్తాయేమో చూడాలి.

More Telugu News