'గంటా అలక' అని 'సాక్షి'లో న్యూస్ వస్తుంటే... లోకేశ్ తో గంటా సెల్ఫీ!
- ట్విట్టర్ లో ఫోటో పెట్టిన సీఎం రమేష్
- వెనుకాల 'సాక్షి' న్యూస్ చానల్
- నవ్వుతూ సెల్ఫీ దిగిన నేతలు
"గంటా శ్రీనివాసరావు అలక" అని గ్రాఫిక్ ప్లేట్ పై కనిపిస్తున్న టీవీ ముందు నిలబడి లోకేశ్, గంటా శ్రీనివాసరావులు సెల్ఫీ దిగగా, దాన్ని సీఎం రమేష్ షేర్ చేశారు. భీమిలి టికెట్ విషయంలో గంటా చాలా ఆగ్రహంగా ఉన్నారని, గత రాత్రి నుంచి ఆయన అదృశ్యం అయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోతో అది అసత్యమని తేలిపోయింది. ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.