sensex: మార్కెట్లపై మోదీ ఎఫెక్ట్.. దూసుకుపోయిన సెన్సెక్స్

  • బాలాకోట్ లో దాడుల తర్వాత మార్కెట్లలో జోష్
  • 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 5 శాతం పైగా లాభపడ్డ భారతీ ఎయిర్ టెల్

బాలాకోట్ లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత వాయుసేన దాడులు, ఎన్నికల ప్రకటన వెలువడటం, మోదీకి ఆదరణ పెరుగుతోందంటూ సర్వేలు వస్తున్న నేపథ్యంలో... దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ పెరుగుతోంది. మన స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 482 పాయింట్లు లాభపడి 37,536కు ఎగబాకింది. నిఫ్టీ 133 పాయింట్లు పుంజుకుని 11,301కి పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (5.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.69%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.27%), ఎల్ అండ్ టీ (3.08%), సన్ ఫార్మా (2.32%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.30%), ఇన్ఫోసిస్ (-0.67%), ఎన్టీపీసీ (-0.59%), ఎఎన్జీసీ (-0.52%), కోల్ ఇండియా (-0.29%).

More Telugu News