Nagababu: తమ్ముడు ఒంటరి వాడే అయినప్పటికీ.. వెనుక సైన్యం ఉంది!: నాగబాబు

  • అభిమానుల రూపంలో కావాల్సినంత సైన్యం
  • టీడీపీకి గట్టి బుద్ధి చెప్పాలి
  • కులాల మధ్య కూరుకుపోయిన అధికారం
  • అభిమానులతో నాగబాబు

తన సోదరుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒంటరివాడే అయినప్పటికీ, ఎన్నికలను ఎదుర్కొనేందుకు కావాల్సినంత సైన్యం అభిమానుల రూపంలో మెండుగా ఉందని కొణిదెల నాగబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో మెగా, పవన్ అభిమానులతో సమావేశమైన ఆయన, తమ కార్యకర్తలను, నేతలను ఎవరైనా ఎంత మానసికంగా వేధించినా, అంతగానూ పైకి లేస్తామని అన్నారు.

పవన్ గెలుపు కోసం జన సైనికులతో కలిసి తాను పని చేస్తానని చెప్పారు. టీడీపీకి గట్టి బుద్ధి చెప్పి, జనసేనను అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన, ఏపీలో అధికారం కులాల మధ్య కూరుకుపోయిందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితి పోవాలని, అది జరగాలంటే, పవన్ కల్యాణ్ అధికారంలోకి రావాలని అన్నారు.

 తెలుగుదేశం పార్టీ ప్రజలకు దూరమైందని, తన కుమారుడు లోకేశ్ ను సీఎంగా చేసే లక్ష్యంతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అధికారులు ఎటువంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా వచ్చే నెల రోజులూ పనిచేయాలని కోరారు.

More Telugu News