Ali: అలీకి సీటు కేటాయిస్తే అక్కడ ఓటమి తప్పదని సర్వేలో తేలినందునే తిరస్కరించాం: టీడీపీ నేత నాగుల్ మీరా

  • అలీ వైసీపీలో చేరడంతో టీడీపీ కౌంటర్లు 
  • మేము తిరస్కరించాకే జగన్ పంచన చేరారు
  • మైనారిటీ ఓట్లను పొందడం వైసీపీకి సాధ్యం కాదన్న మీరా

ప్రముఖ హాస్యనటుడు అలీ నేడు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన తొలుత టీడీపీలో చేరుతారని బాగా ప్రచారం జరిగింది. అలీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. కానీ నేడు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా స్పందించారు. తాము తిరస్కరించాకే అలీ.. జగన్ పంచన చేరారని పేర్కొన్నారు. అలీకి ఏ స్థానమైనా కేటాయిస్తే.. అక్కడ ఓటమి తప్పదని తమ సర్వేలో తేలడంతో తిరస్కరించామన్నారు. ముస్లిం మైనారిటీ ఓట్లను ఈ ఎన్నికల్లో పొందడం వైసీపీకి సాధ్యం కాదన్నారు.

More Telugu News