'బ్రహ్మాస్త్ర' తెలుగు టైటిల్ లోగో బాగుంది: దర్శకుడు రాజమౌళి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బ్రహ్మాస్త్ర' తెలుగు టైటిల్ లోగో బాగుంది: దర్శకుడు రాజమౌళి

  • హిందీలో రూపొందుతోన్న 'బ్రహ్మాస్త్ర'
  • విభిన్నమైన కథాకథనాలు
  • భారీ తారాగణం .. భారీ బడ్జెట్  
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో .. కరణ్ జొహార్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా 'బ్రహ్మాస్త్ర' రూపొందుతోంది. అమితాబ్ .. రణ్ బీర్ కపూర్ .. నాగార్జున .. అలియా భట్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. భారత దేశంలో మొట్టమొదటి మైథలాజికల్ త్రయాలజీ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ సినిమా హిందీ టైటిల్ లోగోను ఇటీవల 'ప్రయాగ'లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు టైటిల్ లోగోను రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 'బ్రహ్మాస్త్ర' టైటిల్ లోగో చాలా బాగుందని చెబుతూ, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. ఈ 'క్రిస్మస్'కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కథాకథనాలపరంగా .. సాంకేతిక పరిజ్ఞానం పరంగా విభిన్నమైన నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాపై, అంచనాలు పెరిగిపోతున్నాయి.
amithabh
nagarjuna
alia bhatt

More Telugu News