అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహారాష్ట్ర వాసుల మృతి

  • మరో ముగ్గురికి తీవ్రగాయాలు
  • బస్సు, కారు ఢీ
  • అనంతపురం-చెన్నై హైవేపై ఘటన
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై బత్తలపల్లి మండలం దంపెట్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోలాపూర్‌కు చెందిన పాల్‌ ప్రమోద్‌సునీల్‌ (24) తన స్నేహితులతో కలిసి కారులో వస్తున్నారు.

అదే సమయంలో రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కదిరి నుంచి అనంతపురం వైపు వెళ్తోంది. ఈ రెండు వాహనాలు దంపెట్లవద్ద ఢీకొట్టుకోవడంతో కారులో ఉన్న సునీల్‌, మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో బత్తలపల్లి ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా అదే ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Anantapur District
dampetla
Road Accident
two dead

More Telugu News