KTR: కేటీఆర్‌...అసదుద్దీన్‌ కలుసుకున్నారు...ఏం మాట్లాడుకున్నారో!

  • లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
  • గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్న ఎంఐఎం
  • రేపు జరిగే ఎన్నికల్లోనూ అవగాహన ఉంటుందన్న భావన

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సభలు, భేటీలతో బిజీగా తిరుగుతున్నారు. ఈరోజు ఆయన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం నెలకొంది. వారిమధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో తెలియరాలేదు.

గత కొంతకాలంగా ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇరుపార్టీలు అవగాహన మేరకే పోటీ చేశాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అవగాహన కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా, కేటీఆర్‌ ఎప్పుడూ తన ప్రసంగంలో 16 ఎంపీ స్థానాలను గెల్చుకుంటామని ప్రకటించడం కూడా ఈ అవగాహనలో భాగంగానే భావిస్తుంటారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News