modi: మోదీ ఎప్పుడు, ఎక్కడ బాంబు వేస్తారోనని జనం భయపడుతున్నారు: రాహుల్ సమక్షంలో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

  • ప్రజలను మోదీ భయపెడుతున్నారు
  • ఆయన ఒక ఉగ్రవాదిలా కనిపిస్తున్నారు
  • మరో ఐదేళ్లు నియంతలా పాలించాలనేది మోదీ ఆకాంక్ష
ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరూ మోదీని చూసి భయపడుతున్నారని అన్నారు. ఏ క్షణంలో, ఎక్కడ బాంబు వేస్తారో అనే భయంతో వణికిపోతున్నారని చెప్పారు. ప్రజలను ప్రేమించడం మానేసి, వారిని భయపెడుతున్నారని విమర్శించారు. మోదీ ఒక ఉగ్రవాదిలా కనిపిస్తున్నారని అన్నారు. శంషాబాద్ సభలో రాహుల్ గాంధీ పక్కన ఉండగా ఆమె ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

రానున్న లోక్ సభ ఎన్నికలు మోదీ, రాహుల్ గాంధీల మధ్యేనని విజయశాంతి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ కృషి చేస్తున్నారని... ఇదే సమయంలో మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరో ఐదేళ్ల పాటు దేశాన్ని నియంతలా శాసించాలనేది మోదీ కోరిక అని... అయితే, ప్రజలు ఆయనకు మరో అవకాశం ఇవ్వబోరని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ, నల్లధనం, పుల్వామా దాడి లాంటి అంశాలతో ప్రజలను మోదీ భయపెట్టారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపుకు మోదీ సహకరించారని అన్నారు.
modi
Rahul Gandhi
vijayashanthi
congress
bjp
kcr
TRS

More Telugu News