Crime News: నిద్రలో ఉండగా నరికి చంపేశారు... తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం

  • ఇంట్లో పడుకున్న వ్యక్తిపై ఘాతుకం
  • అయినవిల్లి మండలం సిరిపల్లి గౌడ కాలనీలో ఘటన
  • వివాహేతర సంబంధమే కారణమన్న అనుమానాలు
నిద్రలో ఉండగా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఓ వ్యక్తిని కర్కశంగా హత్యచేశారు దుండగులు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం సిరిపల్లి గౌడ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు...గ్రామానికి చెందిన వెలిగట్ల వీరవెంకట సత్యనారాయణ (32) స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సత్యనారాయణ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. మారణాయుధాలతో అతనిని దారుణంగా నరికి చంపారు.

 సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సత్యనారాయణ వివాహేతర సంబంధం నెరపుతున్న మహిళ బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
Crime News
man murder
East Godavari District
ayinavilli

More Telugu News