కేఏ పాల్‌కు షాకిచ్చేందుకు సిద్ధమైన ఈసీ.. అయోమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
- ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్చాలని ఈసీని కోరిన వైసీపీ
- పాల్ పార్టీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
- తల పట్టుకుంటున్న పాల్
వైసీపీ అభ్యర్థనతో స్పందించిన ఈసీ ప్రజాశాంతి పార్టీకి నోటీసులు జారీ చేసింది. దీంతో స్పందించిన పాల్.. వైసీపీపై మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తు ఒకేలా ఉండవన్నారు. ఈ రెండింటి మధ్య తేడాను ఓటర్లు గుర్తించగలరని అన్నారు. కాబట్టి తమకు తొలుత కేటాయించిన గుర్తునే కొనసాగించాలని ఈసీని కోరారు. అయితే, హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టి మరో గుర్తును కేటాయించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.