Nagurbabu: తమిళనాడు రాజకీయాల్లోకి గాయకుడు మనో

  • టీటీవీ దినకరన్ సమక్షంలో ఏఎంఎంకేలో చేరిన మనో
  • మనో అసలు పేరు నాగూర్‌బాబు
  • ప్రస్తుతం టీవీ షోలతో మనో బిజీబిజీ
ప్రముఖ నేపథ్య గాయకుడు, మనోగా సుపరిచితమైన నాగూర్‌బాబు అన్నా డీఎంకే రెబల్ నేత టీటీవీ దినకరన్ సమక్షంలో ఏఎంఎంకే పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఆయన మనోగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 25 వేలకు పైగా సినిమా పాటలు, 25 వేలకు పైగా భక్తి పాటలు, ప్రత్యేక ఆల్బం పాటలు పాడారు.

ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, పలు తమిళ చిత్రాల్లోనూ మనో నటించారు. 1985లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంలో తొలి సినిమా పాటను పాడారు. నాగూర్‌బాబుకు మనోగా నామకరణం చేసింది ఇళయరాజానే.  లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనో రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
Nagurbabu
Mano
Singer
AMMK
Tamil Nadu
Tollywood
Kollywood

More Telugu News