Marriage: వధూవరులను ఆశీర్వదించి.. కుప్పకూలి మృతి చెందిన అమ్మాయి తండ్రి

  • గుంటూరు జిల్లా రొంపిచర్లలో  ఘటన
  • పెళ్లి మండపానికి వెళ్తుండగా కుప్పకూలిన వధువు తండ్రి
  • వాయిదా పడిన వివాహం
పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. అక్షింతలు వేసి ఆశీర్వదించిన వధువు తండ్రి అంతలోనే కుప్పకూలిన ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్లలో జరిగింది. వధువు తండ్రి అకాల మరణంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. వైభవంగా జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. మండలంలోని నల్లగార్లపాడుకు చెందిన సైకం రామకోటిరెడ్డి (47) కుమార్తె మౌనికకు అదే గ్రామానికి చెందిన దేవరపల్లి అంజిరెడ్డితో పెళ్లి నిశ్చయమైంది.

శనివారం ఉదయం 10:55కి వివాహం జరగాల్సి ఉండగా కాళ్లగోళ్ల వేడుక కోసం వధువు మౌనికను వరుడు ఇంటికి పంపించారు. ఈ క్రమంలో వధూవరులను రామకోటి రెడ్డి దంపతులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఇంటికి వెళ్లి తయారై పెళ్లి మండపానికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఉండగానే వాహనంపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రామకోటి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లిని కూడా వాయిదా వేశారు.
Marriage
Andhra Pradesh
Guntur District
Rompicharla

More Telugu News