Andhra Pradesh: ఏపీకి ఎందుకు వస్తున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఈ రాష్ట్రం నీ తాతదా?: చంద్రబాబుపై తలసాని ఫైర్

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ఎందుకు వస్తున్నారు? అని తమని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, ‘ఈ రాష్ట్రం నీ తాతదా?' అంటూ బాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏపీలో మాకూ ఉన్నారు బంధువులు. మమ్మల్ని అభిమానించే వాళ్లు, ఇష్టపడేవాళ్లు ఉన్నారు. మా ముఖ్యమంత్రిని గౌరవించే వాళ్లున్నారు’ అన్నారు. చంద్రబాబు కారణంగా ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో, ఆ పార్టీ కాళ్ల దగ్గర టీడీపీని చంద్రబాబు పెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చింది చంద్రబాబేనని ఆరోపించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Chandrababu
talasani

More Telugu News