అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సమాజ్ వాదీ పార్టీ.. మైనాపురి నుంచి ములాయం
- తొలి జాబితాలో ఆరుగురు అభ్యర్థులు
- కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం
- గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ములాయం
2014 లోక్ సభ ఎన్నికల్లో మైనాపురి, ఆజంగఢ్ స్థానాల నుంచి ములాయం పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. అనంతరం మైనాపురి స్థానానికి రాజీనామా చేసి, ఆజంగఢ్ ఎంపీగా కొనసాగారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మైనాపురి నుంచి వీరి కుటుంబానికే చెందిన తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ పోటీ చేసి, గెలుపొందారు.