Hyderabad: టీకా మందు బాధిత చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమం

  • ఆసుపత్రిలో 34 మంది బాధిత చిన్నారులు
  • నీలోఫర్‌ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
  • బాధితులను పరామర్శించిన మంత్రి ఈటల రాజేంద్ర

టీకా మందు ఘటనలో బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నీలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 34కు చేరింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నాంపల్లి అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో ఆరు నెలలలోపు శిశువులు 92 మందికి డిప్తీరియా, హెపటైటిస్‌-బి, హిమోఫీలియా, కోరింత దగ్గు, టెటనస్‌ రాకుండా పెంటావాలెంట్‌ టీకాలు వేసిన విషయం తెలిసిందే.

ఈ టీకా వేశాక శిశువుకు సాధారణంగా జ్వరం వస్తుంది. దీన్ని అదుపు చేసేందుకు పారాసిటమల్‌ ఇవ్వాల్సి ఉండగా ట్రమడ్రాల్‌ 75ఎంజీ మాత్రలు ఇవ్వడంతో ఓవర్‌ డోస్‌ అయి చిన్నారులకు ప్రాణాంతకమైంది. నిన్న ఓ బాలుడు మృతి చెందగా ఈరోజు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, బాధిత చిన్నారులను, వారి తల్లిదండ్రులను మంత్రి ఈటల రాజేంద్ర ఈరోజు పరామర్శించారు.

More Telugu News