hardhik patel: బైకును ఢీకొన్న హార్దిక్ పటేల్ కారు.. పోలీసులతో వాగ్వాదం

  • రాజ్ కోట్-చోటిలా జాతీయ రహదారిపై ప్రమాదం
  • ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ బైకర్
  • వేరే కారులో అహ్మదాబాద్ వెళ్లిపోయిన హార్దిక్
పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రాజ్ కోట్-చోటిలా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు ఓ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకర్ స్వల్పంగా గాయపడ్డాడు. హార్దిక్ కారు ముందు భాగం కొంత దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో హార్దిక్ తో పాటు ఆయన సహచరులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై రాజ్ కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో హార్దిక్, ఆయన సహచరులు వాగ్వాదానికి దిగారు. అనంతరం వేరే కారులో హార్దిక్ పటేల్ అహ్మదాబాద్ వెళ్లి పోయారు. మరోవైపు, ఈనెల 12న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు హార్దిక్ పటేల్ నిన్న ప్రకటించారు.
hardhik patel
car
accident
congress
patidar

More Telugu News