Nellore District: వేదాయపాలెం పీఎస్‌లో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి హల్‌చల్.. పోలీసులకు బెదిరింపులు

  • అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు
  • తమ కార్యకర్తలపై కేసులు ఎందుకు పెట్టారని నిలదీత
  • పోలీసులతో వాగ్వివాదం
నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హల్‌చల్ చేశారు. అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన వైసీపీ కార్యకర్తలపై కేసులు ఎలా పెడతారని పోలీసులపై మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని బెదిరించారు. వారితో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ గురించి తమకు చెప్పాల్సిన పనిలేదంటూ ఈ సందర్భంగా పోలీసులు శ్రీధర్ రెడ్డికి హితవు పలికారు. కోటంరెడ్డి ఇంకా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Nellore District
Vedayapalem
YSRCP
Kotamreddy Sridhar reddy
Police

More Telugu News