Andhra Pradesh: ఏపీకి రెండు కేంద్రీయ విద్యాలయాలు.. కేంద్రం నిర్ణయం

  • ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్ నిర్ణయం
  • గంటూరు జిల్లాలోని ఈర్లపాడులో ఒకటి
  • ప్రకాశం జిల్లా కందుకూరులో మరోటి ఏర్పాటు
నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడులో ఒకటి, ప్రకాశం జిల్లా కందుకూరులో ఒకటి.. మొత్తం రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, బడ్జెట్ వివరాలను త్వరలోనే కేంద్రం వెల్లడించనుంది. 
Andhra Pradesh
Guntur District
Prakasam District
Narendra Modi
BJP

More Telugu News