Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చిరంజీవి సినిమాలో శ్రుతి హాసన్
  • 'మహర్షి' ట్రైలర్ వచ్చేస్తోంది
  • 'చిత్రలహరి' విడుదల తేదీ ఖరారు   

*  'సైరా' చిత్రం తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో ఓ కీలక పాత్రకు శ్రుతి హాసన్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
*  మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కలయికలో వస్తున్న 'మహర్షి' చిత్రం ట్రైలర్ ను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తారు.
*  సాయిధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'చిత్రలహరి' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. కల్యాణి ప్రియదర్శిన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 12న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.

More Telugu News