Jammu And Kashmir: బస్సు కింద గ్రనేడ్ పేలుడు ఘటనలో నిందితుడి అరెస్ట్

  • 32 మందికి తీవ్ర గాయాలు
  • చికిత్స పొందుతూ ఒకరి మృతి
  • హిజ్బుల్ పనిగా తేల్చిన పోలీసులు
  • నిందితుడిని యాసిర్ భట్‌గా గుర్తింపు

జమ్మూలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ బస్సు కింద గ్రనేడ్ పేలడంతో 32 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ గ్రనేడ్ పేలుడుకి కారణమైన వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ననే కుల్గాం నుంచి జమ్మూకి వచ్చిన నిందితుడు.. నేడు దాడికి పాల్పడిన అనంతరం పారిపోయేందుకు యత్నించగా తాము అదుపులోకి తీసుకున్నట్టు జమ్మూ ఐజీపీ ఎంకే సిన్హా వెల్లడించారు.

 సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడిని యాసిర్ భట్‌గా గుర్తించారు. ఈ ఘటన వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని.. దాని కమాండర్ ఫరూక్ అహ్మద్ భట్ అలియాస్ ఉమర్.. యాసిర్‌కు గ్రనేడ్ సమకూర్చినట్టు సిన్హా తెలిపారు. ఫరూక్ అహ్మద్ సహా మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు మొదలు పెట్టాయి.

More Telugu News