India: జర్మనీ కార్ల దిగ్గజం ‘వోక్స్ వ్యాగన్’ కు షాక్.. రూ.500 కోట్ల భారీ జరిమానా విధించిన భారత్!

  • తీర్పు ఇచ్చిన జాతీయ హరిత ట్రైబ్యునల్
  • కర్బన ఉద్గారాలను వెలువరించారని వ్యాఖ్య
  • డీజిల్ కార్లలో ఓ పరికరం కారణంగా వెలువడ్డ ఉద్గారాలు

ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ సంస్థ  వోక్స్ వ్యాగన్ పై భారత్ కు చెందిన జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) కొరడా ఝుళిపించింది. కర్బన ఉద్గారాలను వెలువరించినందుకు ఏకంగా రూ.500 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 2 నెలల్లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వోక్స్ వ్యాగన్ డీజిల్ కార్లలో వాడే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతోందని కేసు నమోదయింది.

దీన్ని విచారించిన ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని బెంచ్ తొలుత నష్టనివారణ చర్యల కింద రూ.100 కోట్లను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో  కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమల శాఖ, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆటోమేటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ విచారణలో వోక్స్ వ్యాగన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో ఆ సంస్థకు రూ.500 కోట్ల భారీ జరిమానా విధిస్తూ ఎన్జీటీ తీర్పు ఇచ్చింది.

More Telugu News