Jammu And Kashmir: జమ్ములో పేలుడు...18 మందికి తీవ్రగాయాలు

షార్ట్స్‌లో చూడండి
జమ్ములోని బస్టాండ్‌లో గురువారం పేలుడు సంభవించింది. బస్సు కింద అమర్చిన గ్రేనేడ్‌ పేలిన ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పుల్వామా దాడి ఘటన మరువక ముందే ఈ సంఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
Go Back to Shorts
Jammu And Kashmir
grenede bomb
busstand

More Telugu News