ఇదో మాయ.. ‘భీమిలి’లో 36 ఓట్లు తొలగించాలని చనిపోయి వ్యక్తి దరఖాస్తు!
- నియోజకవర్గంలో 3,578 ఓట్ల రద్దుకు వినతి
- దోషులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు
- విమర్శలు గుప్పించుకుంటున్న అధికార, విపక్షాలు
భీమిలి నియోజకవర్గంలో మొత్తం 3,578 ఓట్లను తొలగించాలని ఆన్ లైన్ లో దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 36 మంది ఓట్లను తొలగించాలని ఓ చనిపోయిన వ్యక్తి పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దరఖాస్తు చేశారన్నారు. ఈ విషయంలో దర్యాప్తు జరుపుతున్నామనీ, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.